Mahaa Daily Exclusive

  ఎన్నికలొస్తే ఖైరతాబాద్ బీఆర్ఎస్ దే …. బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ మన్నె గోవర్ధన్ రెడ్డి

Share

 

మహా :
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎపుడు ఎన్నికలు జరిగినా బిఆర్ఎస్ పార్టీ విజయం తథ్యమని ఖైరతాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం ఖైరతాబాద్ డివిజన్‌లో అంజన్ కుమార్ ఆధ్వర్యంలో బూత్ కమిటీ సమావేశం
విజయవంతం అయింది. ఇందులో

ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ ఇంచార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ: “రాబోయే ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రా ప్రజల అభివృద్ధికి, రైతుల హక్కులకు, యువత ఉపాధికి, మహిళల సాధికారతకు అంకితమైన పార్టీ. కేసీఆర్ గవ దూరదృష్టి, సంక్షేమ పథకాలు ద్వారా లక్షలాది మంది జీవితాలు మార్చారని అన్నారు. ఇప్పుడు కార్యకర్తలు బూత్ స్థాయిలో దృఢంగా నిలబడి, పార్టీని మరింత బలపరచాలి!”అన్నారు.

కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ గజ్జల ఆనంద్ , శ్యామ్ తాండ్ర మేఘన, శ్రీను, బూత్ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Latest