Mahaa Daily Exclusive

  సీఎం రేవంత్, బీఆర్ఎస్ నేత కేటీఆర్ మధ్య విగ్రహ వివాదం..?

Share

ముఖ్యమంత్రి రేవంత్..బీఆర్ఎస్ నేత కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. రాజీవ్ గాంధీ విగ్రహం పై కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ సీరియస్ గా స్పందించారు. రాజీవ్ విగ్రహం టచ్ చేస్తే ఏం జరుగుతుందో అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ విగ్రహం ఏర్పాటుకు కేటీఆర్ ఆలోచన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రేవంత్ ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేసారు.

 

విగ్రహ వివాదం

తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన తొలిరోజే బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తామని విమర్శించారు. నా మాటలు గుర్తుపెట్టుకో చీప్‌ మినిస్టర్‌ అని రేవంత్‌ రెడ్డిని హెచ్చరించారు. స్కూలు పిల్లల ముందు మీరు మాట్లాడిన తీరు కుసంస్కారానికి నిదర్శనమని తెలిపారు. ఢిల్లీకి గులాంగిరీ… ఢిల్లీకి గులాంగిరీ చేసే లాంటి మీ వాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకోలేరని కేటీఆర్ ట్వీట్ చేశారు.

 

కేటీఆర్ రిప్లై

రేవంత్ రెడ్డి మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడిన వాళ్ల విగ్రహాలను ఉంచుతామని, మిగిలిన చెత్తనంతా తాము అధికారంలోకి రాగానే తొలగిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయో వివరించేందుకు ఇవే తార్కాణాలు అని ట్విట్టర్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రెండు ఫొటోలను కూడా ఆయన షేర్‌ చేశారు. నిజామాబాద్‌లో పోలీసుల వేధింపులతో విసుగుచెందిన ఓ స్వీట్‌ షాపు యజమాని తన దుకాణాన్ని మూసివేస్తూ ఒక బ్యానర్‌ పెట్టారని తెలిపారు.

 

డైలాగ్ వార్

ఒకవైపు ఇలా నిజామాబాద్‌లో చిన్న వ్యాపారులను వేధించడంలో బిజీగా ఉంటే.. మరోవైపు వరంగల్‌లోని రద్దీ రహదారిపై నిర్వహించిన కాంగ్రెస్‌ మంత్రి కొండా సురేఖ పుట్టిన రోజు వేడుకల్లో ఏసీపీ పాల్గొన్నారని వెల్లడించారు. ఈ వేడుకల్లో క్రాకర్స్‌ కాల్చడం వల్ల అమాయకులు గాయపడ్డారని మండిపడ్డారు. సచివాలయం బయట ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపలకు డిసెంబర్ 9 లోగా తరలిస్తామని రేవంత్ స్పష్టం చేసారు. ఇప్పుడు రేవంత్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.