- పార్టీలకు తప్పని రెబల్స్ బెడద
- ప్రతి పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ల దాఖలు
- గట్టి పోటీ ఎవరిస్తారన్న లెక్కల్లో పార్టీ ముఖ్య నేతలు
- మిగతా అభ్యర్థులను పోటీ నుంచి విరమింప చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు
- పోర్టీ పిరాయింపులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు
కరీంనగర్, మహా : నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో భుజ్జగింపుల పరువానికి ప్రధాన పార్టీలు తెరలేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీల తరఫున ఊహించిన దాని కంటే భిన్నంగా అభ్యర్థులు పోటీ పట్ల ఆసక్తి చూపించారు. గతానికి భిన్నంగా నామినేషన్ దాఖలు వేశారు .ఎట్టి పరిస్థితిలో బరిలో నిలుస్తామని సంకేతాలు ఇచ్చారు. దీంతో ప్రధాన పార్టీల నేతలు అంతా ఎవరిని అభ్యర్థులుగా ఖరారు చేయాలని విషయంలో మల్ల గుల్లాలు పడుతున్నారు. ఉన్నవారిలో ఎవరికైతే టికెట్ అర్హులు ,ఎవరు అనర్హులని తేల్చే పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. సర్వేలు కూడా చేస్తున్నారు. పోటీకి ఆసక్తి ఉన్న వారి జాబితాను ముందు పెట్టుకొని ఎవరిని ఒప్పించాలి ,ఎవరిని మెప్పించాలనే విధంగా పార్టీ ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నారు. డివిజన్లు, వార్డుల వారిగా అభ్యర్థులకు ప్రజల నుంచి ఉన్న మద్దతు ఆధారంగా టికెట్లను కేటాయించాలని భావిస్తున్నారు. టికెట్లు లభించని వారిని సముదాయించేందుకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. టికెట్ దక్కని వారు పార్టీని విడిచిపెట్టకుండా ఉండేందుకు ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు .ఎక్కడెక్కడ అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయని గుర్తించి అక్కడ వారిని ఒప్పించేందుకు చొరవ తీసుకుంటున్నారు. 3 వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. ఈ లోపు టికెట్ రాని వారందరితో మాట్లాడి నామినేషన్ ఉపసంహరించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో సదరు అభ్యర్థులకు ఎవరు దగ్గరగా ఉంటారో గుర్తించి పనిని చెక్కబెట్టే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీ పరంగా సమున్నత స్థానాన్ని పలు పదవులు అందిస్తామని భరోసా ఇస్తున్నారు. ఒకే వార్డులో ప్రతి పార్టీ నుంచి సగటున ఇద్దరూ లేదా ముగ్గురు నామినేషన్లు వేశారు. ఇందులో బలమైన వ్యక్తికి టికెట్ ఇచ్చి మిగతా ఇద్దరు అభ్యర్థికి సహకరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఇందులో ఏ ఒక్కరు అలకబూనిన పక్క పార్టీలో చేరకుండా శతవిదాల ప్రయత్నిస్తున్నారు. ఈ నాలుగు రోజులపాటు నాలుగు జిల్లాల పరిధిలోని అన్ని పార్టీలకు ఈ రెబల్స్ బెడదనే ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యను అధిగమిస్తేనే.. మేలనే విధంగా పార్టీలు ఆచితూచి అడుగులేస్తున్నాయి.








