కుషాయిగూడ, మహా : గత మూడు నెలల నుండి హోం శాఖలో ఖైదీల ఫెరోల్ ఫైల్ లు నిలిపివేత తెలంగాణ జైల్లో శాఖల్లో జీవిత ఖైదీల ఫెరోల్ ఫర్ లో ఫెరోల్ ఫైల్ నిలిపివేయడంతో ఖైదీలు సెలవులపై వెళ్లడంలో జైళ్లలో మగ్గుతున్న రూ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తెలంగాణ జైల శాఖలో ఖైదీలు సెలవులకు అర్జీ పెట్టుకుంటారు 15 రోజులు నెల రోజులు సెలవులు ఉంటాయి. జీవిత ఖైదీలకు సెలవులను నిలిపివేయడంతో అటు కుటుంబ సభ్యులను చూడలేక జైలు నాలుగు గోడల మధ్యనే నరకయాతన అనుభవిస్తున్నారు ఖైదీల వారి వారి నివాసాల వద్ద కుటుంబ సభ్యులు బాగోగు లేకుంటేనే సెలవులను మంజూరు చేస్తామని కథాకటిగా ఇటు జైలు అధికారులు అటు హోంశాఖ అధికారులు చెబుతున్నారు మూడు నెలల కాలం నుండి ఖైదీల సెలవుల అర్జీలు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జైల్లో ఉన్నటువంటి ఖైదీల ఫైల్స్ సుమారు 500 వరకు ఉంటాయని అంచనా ఎన్నిసార్లు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు హోంశాఖకు పంపించిన వాటిని అలాగే పెండింగ్లో ఉంచడం వల్ల వందలాది మంది ఖైదీలు సెలవులను కోల్పోతున్నారు అటు భార్య పిల్లలను చూసుకోలేక నిత్యం జైలు నాలుగు గోడల మధ్యనే నలిగిపోతున్నామంటూ ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై ఖైదీల కుటుంబ సభ్యులు మంత్రులను కలిసి ఖైదీలకు సెలవులు మంజూరు చేయాలంటూ మొరపెట్టుకున్నారు జైల్లో మగ్గుతున్న ఖైదీలు కూడా జైల్ అధికారులను సెలవులను మంజూరు చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు తమ వద్ద ఏమీ లేదని హోంశాఖలోని ఆగిపోయావంటూ ఖైదీలకు సమాధానం చెబుతున్నారు ఇప్పటికైనా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మాయందు దయతెలచి సెలవులను మంజూరు చేయాలని గత మూడు నెలల నుండి నిలిపివేసిన ఖైదీల సెలవులను మంజూరు చేయాలని ఖైదీలు మొరపెట్టుకుంటున్నారు








