Mahaa Daily Exclusive

  కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు .. సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించిన పాలకవర్గం..

Share

హైదరాబాద్, మహా : మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కీసరగుట్టలో శ్రీ భవాని శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంగళవారం ఆయన నివాసంలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ తటాకం వెంకటేష్ శర్మ, కార్యనిర్వాహణాధికారి కట్ట సుధాకర్‌రెడ్డి కలిసి ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ అధికారులు సీఎంకు వివరించారు.

Latest