- మళ్లీ రిపీట్ అయితే బట్టలిప్పి కొడుతాం
- ఎమ్మెల్యే అనిరుధ్‍రెడ్డికి జనసేన వార్నింగ్
- పవన్ పై అనిరుధ్ వ్యాఖ్యలపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన నేతలు
హైదరాబాద్, మహా : మునిసిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ – జనసేనల మాటల తూయాలు పేలుతూనే ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగింది. అంతే కాకుండా కూటమి పొత్తులలో భాగంగా బీజేపీ – జనసేన తరఫున పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచారానికి సిద్ధమవడంతో కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‍పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మంగళవారం జనసేన నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం జనసేన పోటీలో ఉంటే మా పార్టీ అధినేత పవన్ కల్యాణ్‍పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇవాళ అనిరుధ్ రెడ్డిపై జనసేన పార్టీ నేతలతో కలిసి ఆ పార్టీన నేత సంపత్ నాయక్ ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు.
పవన్ కల్యాణ్‍పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే అనిరుధ్ రెడ్డి ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఆయన బట్టలిప్పి కొడతామని ఈ సందర్భంగా సంపత్ నాయక్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంటే ఎందుకు పోటీ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నిస్తున్న వారికి సిగ్గుందా? అని సంపత్ నాయక్ నిలదీశారు. జనసేన తరఫున పోటీ చేస్తున్నది బడుగు బలహీన వర్గాలు, గిరిజన బిడ్డలేనన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనిరుధ్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ ఎక్కడా కనిపించలేదని ఆ సమయంలో అనిరుధ్ రెడ్డి ఏడున్నావ్ రా బై అంటూ ఘాటు వ్యాఖ్యలతో జనసేన నేత రెచ్చిపోయారు. మాలాంటి పేదలకు సీట్లిచ్చిన పవన్ కల్యాణ్ పై అవాకులు చెవాకులు పేలితే బాగుండదన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.








