మణుగూరు, వేదిక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు 30 ఏళ్ల చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో భారీ వర్షం తో నీట మునిగింది . మణుగూరు పట్టణం లోని
కట్టవాగు, కోడిపుంజుల వాగుల ఉదృత ప్రవాహం ఫలితంగా పట్టణ ప్రధాన రహదారిపై మోకాళ్ళ లోతు చేరిన నీరు.
నీట మునిగిన సుందరయ్య నగర్, వినాయక నగర్, బాలాజీ నగర్, కుంకుడు కాయల చెట్ల గుంపు, గాంధీనగర్, కాళీమాత ఏరియా ఆదర్శనగర్, మరియు చేపల మార్కెట్ ప్రాంతం.
రెవిన్యూ, మున్సిపల్ సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ,పోలీసు సిబ్బంది అందరూ చైతన్యవంతులై లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించాలని, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలని,వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమై అత్యవసర సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
Post Views: 13








