Mahaa Daily Exclusive

  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ట్విస్ట్ .. తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో సీబీఐ పిటిషన్….

Share

 

ఢిల్లీ, మహా : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 23 మందికి ట్రయల్ కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ వ్యవహారంలో ట్విస్ట్ లు చోటుచేసుకున్నాయి. ట్రయల్ కోర్టు నిర్ణయం పై సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీ ఎంపీ కవిత సహా 23 మందికి క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు నిర్దోషులుగా తేల్చడాన్ని సవాల్ చేస్తూ.. సీబీఐ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో న్యాయ పోరాటం మళ్లి ప్రారంభం అయింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ‘క్లీన్ చీట్’ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ అప్పీల్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తులో లభించిన కీలక సాక్ష్యాలను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, నిందితులను విడిచిపెట్టడం వల్ల దర్యాప్తు సంస్థ నైతిక స్థైర్యం దెబ్బతింటుందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, స్టే విధిస్తే కేజ్రీవాల్‌, కవిత సహా ఇతర నేతలకు వచ్చిన ఉపశమనం తాత్కాలికమే అవుతుంది. ఈ పరిణామంతో ఈ కేసుపై న్యాయ పోరాటం మళ్ళీ మొదటికి వచ్చినట్లవుతుంది.