Mahaa Daily Exclusive

  శార‌ద పీఠం భూములు కొన‌సాగింపు….

Share

  • శార‌ద పీఠం భూములు కొన‌సాగింపు….
  •  జ‌ల‌మండ‌లికి కేటాయింపులు ర‌ద్దు…
    నిర్మాణాల స్థితిపై తాజా స‌మాచారం తెలియ‌జేయ‌నందుకు అధికారుల‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం…

హైద‌రాబాద్: కోకాపేట‌లో శార‌దా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొన‌సాగించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. పీఠం భూములు జ‌ల మండ‌లికి కేటాయించిన నేప‌థ్యంలో అక్క‌డ సాగుతున్న నిర్మాణ ప‌నుల విష‌యాల‌ను పీఠం ప్ర‌తినిధులు ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు. ఈ అంశంపై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఉన్న‌తాధికారుల‌తో శ‌నివారం సాయంత్రం స‌మావేశ‌మ‌య్యారు. కోకాపేట భూముల్లో పీఠం ఆధ్వ‌ర్యంలో వివిధ నిర్మాణాల తాజా స్థితిని ముఖ్య‌మంత్రి తెలుసుకున్నారు. పీఠం భూముల‌ను జ‌ల‌మండ‌లికి కేటాయించే స‌మ‌యంలో నిర్మాణాల స్థితిని తెలియ‌జేయ‌క‌పోవ‌డంపై ముఖ్య‌మంత్రి మండిప‌డ్డారు. జ‌ల మండ‌లికి కేటాయింపులు ర‌ద్దు చేసి పీఠానికే ఆ భూములు కొన‌సాగించాల‌ని ఆదేశించారు. మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబును క‌లిసి నిర్మాణాలు, ఇత‌ర ప‌రిస్థితుల‌ను వివ‌రించాల‌ని ముఖ్య‌మంత్రి, పీఠం ప్ర‌తినిధుల‌కు సూచించారు.