Mahaa Daily Exclusive

  గొడకొండ్ల రామలింగేశ్వరాలయంలో ఉద్రిక్తత..! అర్చకుడిపై దౌర్జన్యం..!

Share

  • గొడకొండ్ల రామలింగేశ్వరాలయంలో ఉద్రిక్తత.
  •  అర్చకుడిపై దౌర్జన్యం!
  •  ఆలయ వ్యవహారాల్లో అన్యమతస్థుడి జోక్యం..
  •  పోలీసుల తీరుపై భక్తుల ఆగ్రహం.

నల్గొండ, మహా.

నల్గొండ జిల్లా మాల్ పరిధిలోని గొడకొండ్ల గ్రామంలో గల చారిత్రక శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయ అర్చకుడు శ్రీకాంత్ శర్మపై స్థానిక అన్యమతస్థుడు రహీమ్ దుర్భాషలాడుతూ, దౌర్జన్యానికి దిగడం స్థానికంగా పెను కలకలం రేపింది. దేవాలయ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడమే కాకుండా, ధర్మబద్ధంగా విధులు నిర్వహిస్తున్న అర్చకుడిని అడ్డుకుని, అసభ్య పదజాలంతో దూషించడంపై భక్తులు మరియు హిందూ సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఒక్కసారిగా మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

బాధిత అర్చకుడు శ్రీకాంత్ శర్మ జరిగిన ఉదంతంపై మర్రిగూడ, చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, అధికారులు స్పందించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడు రహీమ్‌పై స్పష్టమైన ఆధారాలతో ఫిర్యాదు చేసినా, పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఇటువంటి మతోన్మాద శక్తులు బరితెగిస్తున్నాయని, పవిత్రమైన దేవాలయాల పైన, అర్చకుల పైన దాడులకు తెగబడుతున్నారని భక్తులు మండిపడుతున్నారు.

Latest