Mahaa Daily Exclusive

  ఎన్నికలప్పుడే రాజకీయాలు.. తర్వాత అందరి లక్ష్యం అభివృద్ధే కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

Share

  • ఎన్నికలప్పుడే రాజకీయాలు
  • ఆ తర్వాత అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలి
  • సమాజంలో మార్పు కోసం విద్యావంతులు పని చేయాలి
  • బీజేపీ రథసారధి రాంచందర్ రావు

హైదరాబాద్, మహా : ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. గురువారం ఉదయం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని క్రిసెంట్‌ గేటెడ్‌ కమ్యూనిటీ వాసులతో సీనియర్‌ సిటిజన్‌ ఫోరం రమేష్ బాబు ఆధ్వర్యంలో మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్‌ యాదవ్‌, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణయాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ.. విద్యావంతులు సమాజంలో మార్పు కోసం కృషి చేయాలన్నారు. 12 ఏళ్ల క్రితం దేశం ఆర్థికంగా 12వ స్థానంలో ఉందని, ప్రస్తుతం 4వ స్థానంలో ఉందన్నారు. 2014లో ఎకానమీ రూ.106.57 లక్షల కోట్లు కాగా, ప్రస్తుతం రూ. 331.03లక్షల కోట్లని ఆయన అన్నారు. అభివృద్ధిలో దేశం ఎంతో ముందుందన్నారు. విద్యావంతులు ఈ విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో చంద్రశేఖర్‌, కృష్ణయ్య, సూర్యతేజ, పూర్ణచందర్‌రావు, శ్రీనివాస్‌, అశోక్‌ బాల్దా, మహిపాల్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, జితేందర్‌, శివయాదవ్‌, శ్రీశైలం, రాజేశ్వర్‌రెడ్డి, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Latest