*యాపిల్‌కు కొత్త బాస్.
*నూతన సీఈవోగా జాన్ టెర్నస్**
*పదవి నుంచి తప్పుకోనున్న టిమ్ కుక్.. ముగియనున్న 15 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం**
*సెప్టెంబర్ 1 నుంచి పగ్గాలు చేపట్టనున్న టెర్నస్**
*హైదరాబాద్, మహా *
ప్రపంచ అగ్రశ్రేణి టెక్ దిగ్గజం యాపిల్ సంస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘకాలంగా సంస్థను విజయపథంలో నడిపించిన ప్రస్తుత సీఈవో టిమ్ కుక్ తన పదవి నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో యాపిల్ నూతన బాస్‌గా 50 ఏళ్ల జాన్ టెర్నస్ ఎంపికయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆయన అధికారికంగా సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ 2011లో మరణించిన అనంతరం సంస్థ అత్యున్నత బాధ్యతలను టిమ్ కుక్ స్వీకరించారు. అప్పటినుంచి సుమారు 15 ఏళ్ల పాటు తనదైన మార్క్ లీడర్‌షిప్‌తో యాపిల్‌ను అగ్రస్థానంలో నిలబెట్టారు. ఎన్నో వినూత్న ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడంతో పాటు సంస్థ ఆదాయాన్ని, గ్లోబల్ బ్రాండ్ విలువను ఊహించని స్థాయికి పెంచడంలో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన పదవీ విరమణ చేయనుండటంతో, యాపిల్ సంస్థలో కుక్ 15 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి అధికారికంగా ముగింపు పడనుంది.
సంస్థ భవిష్యత్తును, సాంకేతిక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని తదుపరి సీఈవోగా జాన్ టెర్నస్‌ను యాపిల్ ఎంపిక చేసింది. హార్డ్‌వేర్ విభాగంలో విశేష అనుభవం ఉన్న టెర్నస్ నియామకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ నుంచి ఆయన ఆధ్వర్యంలో యాపిల్ సరికొత్త ఆవిష్కరణలతో మరింత ముందుకు దూసుకెళ్తుందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగానే ఈ నాయకత్వ మార్పు జరుగుతున్నట్లు తెలుస్తోంది.








