Mahaa Daily Exclusive

  దేవరకొండ ఎస్‌బీఐ చోరీ కేసు ఛేదింపు…

Share

*నలుగురు నిందితుల అరెస్ట్.. రూ.2.42 కోట్ల నగదు రికవరీ.
నల్గొండ, మహా.
జిల్లాలోని దేవరకొండ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్‌లో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. పక్కా సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఏకంగా రూ.2.42 కోట్ల నగదును nరికవరీ చేసినట్లు వెల్లడించారు.
కంచే చేను మేసిన చందంగా.. ఈ చోరీకి పాల్పడింది ప్రధానంగా బ్యాంకు వ్యవహారాలతో సంబంధం ఉన్నవారే కావడం గమనార్హం. అరెస్టైన నిందితుల వివరాలను పోలీసులు ఈ విధంగా వెల్లడించారు.
ఏ1 (చక్రపాణి)ఇతను చోరీ జరిగిన దేవరకొండ ఎస్బీఐ బ్రాంచ్‌లోనే హౌస్‌ కీపింగ్‌ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ కేసుకు సంబంధించి ఇతనే ప్రధాన నిందితుడు.ఏ2 (రామాంజనేయులు) ఇతను సూర్యాపేట ఎస్బీఐ ప్రధాన (మెయిన్) బ్రాంచ్‌లో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.ఏ3 (కేతావత్‌ రామ్‌ లాల్‌) ఇతను ఎస్బీఐలో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.ఏ4 (శివ)ఇతను వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్.పక్కా ప్రణాళికతో బ్యాంకు వ్యవహారాలు తెలిసిన వ్యక్తులే ఈ భారీ దోపిడీకి స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి నగదుతో పాటు 6 సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను ,పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.