Mahaa Daily Exclusive

  జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఖమ్మం కృష్ణవేణి కళాశాల విద్యార్థుల జైత్రయాత్ర…..

Share

 

ఖమ్మం, (మహా ఎడ్యుకేషన్)
ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఖమ్మం నగరంలోని కృష్ణవేణి కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్లు **గొల్లపూడి జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన విజయోత్సవ సభలో మాట్లాడుతూ.. అత్యుత్తమ ర్యాంకులతో తమ విద్యార్థులు కళాశాల కీర్తిని దశదిశలా వ్యాపింపజేశారని హర్షం వ్యక్తం చేశారు.ఓపెన్ కేటగిరీలో:
*ఏ. శిశిర్ సాయి – 1355
* ఈ. హర్షిత్ – 3311
* వి.ఎస్.ఎస్ లక్ష్మి – 4513
* ఏ. మోక్షిత సాయి – 5144,రిజర్వేషన్ కేటగిరీలో
రిజర్వేషన్ విభాగంలో డి. అలేఖ్య **41వ ర్యాంకు**, కె. స్టాన్లీ చరణ్ **59వ ర్యాంకు** సాధించి ప్రభంజనం సృష్టించారు. వీరితో పాటు టి. సంతోష్ కుమార్ (360), వి.ఎస్.ఎస్ లక్ష్మి (529), సిహెచ్. శైలజ (559), ఏ. మోక్షిత సాయి (609), బి. సంతోష్ (1259), ఎ. చరణ్ (1891), బి. కార్తీక్ (2016), జె. అఖిల్ (2803) సహా 20 మందికి పైగా విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు.
*నిరంతర సాధనే విజయ రహస్యం:*
ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ, విద్యార్థుల ఉన్నత లక్ష్యాల కోసం కళాశాల బోధనా సిబ్బంది అందించిన నిరంతర ప్రోత్సాహం, క్రమశిక్షణతో కూడిన సాధన వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు. జిల్లాకు గర్వకారణంగా నిలిచిన విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.
*ఘనంగా సన్మానం:*
ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఘనంగా అభినందించి, సత్కరించింది. ఈ విజయోత్సవ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ ఏలూరి వంశీకృష్ణ, ఏవో నిరంజన్ కుమార్ అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.