- కాంగ్రెస్ పార్టీలో చేరిన రాయపోల్ గ్రామ సర్పంచ్ మమత శ్రీశైలం
- ఎమ్మెల్యే రంగారెడ్డి సహకారంతో గ్రామాభివృద్ధి చేస్తాం
రాయపోల్ గ్రామ సర్పంచ్ మమత శ్రీశైలం
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామ సర్పంచ్ అచ్చన మమత శ్రీశైలం, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో, గ్రామ వార్డు సభ్యులతో కలిసి కాంగ్రేస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే రంగారెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని, రాయపోల్ గ్రామ సర్పంచ్ అచ్చన మమత శ్రీశైలం తెలిపారు. మునుముందు ఎమ్మెల్యే రంగారెడ్డి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని గ్రామ సర్పంచ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ కర్ణాకర్, మాజీ జెడ్పిటిసి మహిపాల్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, రాయపోల్ మాజీ సర్పంచ్ అశోక్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఈసీ శేఖర్ మామ, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.








