Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌లో జలమండలి జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు…

Share

హైదరాబాద్‌లో జలమండలి జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు

హైదరాబాద్‌లోని జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. తన ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు చేపట్టారు.

సోదాల్లో భాగంగా అధికారులు రూ.1.10 కోట్ల నగదు, సుమారు ఒక కిలో బంగారం, పలు కీలక ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో కుమార్ సుమారు రూ.100 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా కుమార్‌కు చెందిన స్థిర, చర ఆస్తుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.