Mahaa Daily Exclusive

  అగ్నిప్రమాదంలో మోటర్, పైపులైన్ దగ్ధం

Share

కారేపల్లి, మహా: తుప్పలకు పెట్టిన నిప్పు మిర్చితోటకు అంటుకోని మిర్చి పంటతో పాటు వ్యవసాయ మోటర్, పైపు లైను దగ్ధం అయిన ఘటన కారేపల్లి మండలం నానునగర్‌తండాలో ఆదివారం చోటుచేసుకుంది. నానునగర్‌తండా సమీపంలోని బోడు వద్ద ఉపాధీ హామీ పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఆప్రాంతంలో పొదలకు నిప్పంటుకోని పక్కనే ఉన్న అజ్మీర రాజేష్ అనే రైతు కు చెందిన మిర్చితోటకు అంటుకుంది. మిర్చితోట అంతట వ్యాపించిన మంటలు వ్యవసాయ బోరు ప్రాంతానికి చేరుకోని మోటర్ పైపులు కాలి మోటర్ బోరు బావిలో పడిపోయింది. భూమి పైభాగంలో వేసిన పైపు లైను, బోరు కేసింగ్ పైపు పూర్తిగా కాలిపోయాయి. మిర్చితోట చివరి కాపు ఎరలేదు. దానిలో సుమారు 6 క్వింటాళ్ల మిర్చి ఉందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి పనుల వద్ద నిర్లక్ష్యంగా పెట్టిన నిప్ప్పు వల్లె తన మిర్చి తోట, మోటర్, పైపులైన్లు కాలిపోయాయని బాధిత రైతు ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. దీనికి సంబంధించి కారేపల్లి పోలీస్ స్టేషన్‌లో బాధిత రైతు రాజేశ్ పిర్యాదు చేశాడు.