- ఫ్రెండ్లీ పోలీసింగ్ కే ప్రాధాన్యత
- పోలీసులది బాధితుల పక్షమే
- చట్టాలపై చైతన్యతోనే నేరాల అదుపు – సింగరేణి సీఐ సాగర్
కారేపల్లి, మహా : పోలీసులు ఎప్ప్పుడు బాధితుల పక్షమే వహిస్తారని, రాజకీయ ఒత్తిడి ఉన్నా బాధితులకు అన్యాయం చేయబోమని సింగరేణి సీఐ ఎన్.సాగర్ అన్నారు. సోమవారం కారేపల్లిలోని సర్కిల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ తాను ప్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తానని, పైరవీ కారులు, మధ్యవర్తుల అవసరం లేకుండానే తమ వద్దకు రావచ్చని తెలిపారు. వరంగల్ జిల్లా వాసిగా 2004 లో టీచర్‌గా ప్రారంభమైన తన కేరియర్ 2007లో ఎస్సైగా సెలక్ట్ అయి భద్రాద్రికొత్తగూడెం జిల్లా బోడు ఎస్సైగా బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. పదోన్నతిపై సీఐ మొదటి పోస్టింగ్ రామగుండంలో చేసినట్లు తెలిపారు. పోలీస్ ఉద్యోగంలో ఊహించని సంఘటనలు జరుగుతుంటాయని వాటిని చాక్యచక్యంగా ఎదుర్కొవల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ పూర్తి కారేపల్లి పరిస్ధితిలు వ్యతికంగా ఉన్నాయన్నారు. దొంగతనాలు నియంత్రణపై గట్టి నిఘా పెట్టామని ఇప్పటివరకు సింగరేణి సర్కిల్ పరిధిలో జరిగిన దొంగతనాలు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు చేశారని తమ విచారణలో తేలిందన్నారు. కేసులలో పురోగతి కనిపిస్తుందని తెలిపారు. బాధితులకు న్యాయం దొరుకుతుందనే భరోసా ఇవ్వగల్గుతున్నామన్నారు. అందరి సహకారంతో నేరాల అదుపుకు కృషి చేస్తామన్నారు.








