- స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన
- మహిళాభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యత
కారేపల్లి, మహా : స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయటం ద్వారా మహిళ అర్ధికాభివృద్ధి ని సాధించటానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీడీవో మల్లెల రవీంద్రప్రసాద్, భాగ్యనగర్తండా, పేరుపల్లి, ఎర్రబోడు సర్పంచ్లు బానోత్ హిరాలాల్, బానోత్ పద్మా, ఈసాల అలివేలు లు అన్నారు. సోమవారం భాగ్యనగర్తండా, పేరుపల్లి లలో గ్రామసమాఖ్య సంఘం భవనానికి ఎంపీడీవో, సర్పంచ్లు శంకుస్ధాపన చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో నిర్మిస్తున్న స్త్రీశక్తి భవనాల ద్వారా స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చన్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం జీవో వడ్డీకే రుణాలు అందిస్తుందన్నారు. ప్రభుత్వ పధకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ వైసఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, క్లస్టర్ కోఆర్డినేటర్ రాజేశ్వరి, పంచాయితీ కార్యదర్శి అనిల్ కుమార్, ఉప సర్పంచ్ గుగులోత్ బిక్కులాల్, వార్డ్ సభ్యులు వాంకుడోత్ గాంధీ, సుమ, సంధ్య, కాంగ్రెస్ జిల్లా నాయకులు గుగులోత్ భీముడు నాయక్, మల్లెల నాగేశ్వరరావు, బానోత్ రాందాస్, భూక్య రాంచందర్, బాబు, అప్పారావు,సెర్ప్ సిబ్బంది గౌస్ పాషా, అరుణ, బేగం కొనారి, నీలా, బుజ్జి స్థలదాతలు శంకర్, బుజ్జి, పంచాయితీ సిబ్బంది రాందాస్, అజ్మీర హేంచంద్ తదితరులు పాల్గొన్నారు.








