Mahaa Daily Exclusive

  పాలకుల విధానాలతో రైతుకు కష్టాలు..

Share

  • పాలకుల విధానాలతో రైతుకు కష్టాలు
  • కారేపల్లి మండల ఏఐకేఎంఎస్ నూతన కమిటీ ఎన్నిక

కారేపల్లి, మహా : కేంద్ర రాష్ట్ర పాలకుల విధానాలతో రైతుకు కష్టాలు, నష్టాలు తప్పటం లేదని అఖిల భారత రైతు కూలీ సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి వై.ప్రకాశ్ అన్నారు. శనివారం కారేపల్లి మండలం జమాళ్లపల్లిలో ఏఐకేఎంఎస్ కారేపల్లి మండల మహాసభ అమరవీరులు పెద్దబోయిన వెంకటేశ్వర్లు, ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి నగర్‌లో జరిగింది. ఈ మహాసభలో వై.ప్రకాశ్ మాట్లాడుతూ రైతు పండించిన పంటలకు స్వామినాధన్ కమిషన్ సిపార్స్‌ల అనుగుణంగా గిట్టుబాటు ధరకల్పించాల్సిన ప్రభుత్వాలు దాని ఊసు ఎత్తటం లేదన్నారు. ఏజన్సీ చట్టాలను తుంగలో తొక్కి నూతన అటవీ సంరక్షణ చట్టం పేరుతో అడవులను అందులో ఉన్న ఖనిజ సంపదను ఆదాని అంబానీలకు నేటి ప్రభుత్వాలుతాకట్టు పెట్టినారని పెట్టారని విమర్శించారు. ఐక్య పోరాటాలతోనే రైతు కూలీల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అనంతరం నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఏఐకేఎంఎస్ సింగరేణి మండల అధ్యక్షులుగా కోయల శ్రీనివాస్, కార్యదర్శిగా కంచర్ల శ్రీనివాసరెడ్డి తో పాటు మరో 11 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈకార్యక్రమంలో పీవోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి వై.జానకి, ఏఐకేఎంఎస్ మండల నాయకులు మద్దెల రామ్మూర్తి, రాంజీ, కావేటి నాగేశ్వరరావు, గడ్డం వెంకన్న, ఆలెం గురవయ్య, చంద్రయ్య, బాటయ్య, రాంబాబు, సుగుణ, జోగయ్య, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, రామనాథం తదితరులు పాల్గొన్నారు.