- ఎన్నికలప్పుడే పొత్తు ధర్మం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై సమరశీల పోరాటాలకు సంసిద్దం
- సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలలో కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్, మహా : ప్రజా సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై సమరశీల పోరాటాలకు సంసిద్దం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎఎల్ఎ కూనంనేని సాంబశివరావు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రాజీలేనిపోరాటాల ద్వారా సిపిఐకి పూర్వ వైభవం తీసుకురావడంతోపాటు రానున్న ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. సోమవారం సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్‌లో సిపిఐ వనపర్తి జిల్లా కార్యదర్శి విజయ రాములు అధ్యక్షతన జరిగిన సిపిఐ రాష్ట్ర సమితి సమావేశంలో కూనంనేని సాంబశివరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లడమే లక్ష్యంగా పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. రానున్న రెండేళ్ల కాలాన్ని ’ఉద్యమాల కాలం’గా మార్చుకుని, ఎలాంటి ఈగోలు లేకుండా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సిపిఐ సెంట్రల్ కమిషన్ చైర్మన్ డాక్టర్.కె.నారాయణ, జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణలు వేదిక మీద ఆశ్సీనులు కాగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్ల పల్లి శ్రీనివాస్ రావు, ఈటి నరసింహా, సిపిఐ కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్యపద్మ , భాగం హేమంతరావు, వి.ఎస్‌బోస్, కలవేన శంకర్, ఎం.బాలనరసింహాలు హజరయ్యారు.
దక్షిణాదిలో బిజెపికి తావులేదు
మతపరమైన విభజన, మత ఫండమెంటలిజం అనే పునాది తప్ప ప్రజా సంక్షేమం పట్టని బిజెపికి దక్షిణాదిలో తావు లేదని సాంబశివరావు అన్నారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలపై ఆయన మాట్లాడుతూ మూడురాష్ట్రాలలో బిజెపి నిలదొక్కుకున్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణను కూడ బిజెపి కమ్మేస్తుందని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని, ఇక్కడ ఆ పార్టీ అధికారం రావడం ఎప్పటికీ జరగదన్నారు. కేరళలో కొద్దిపాటి తేడాతో మూడో పర్యాయం గెలవలేకపోయామన్నారు. కానీ తమిళనాడులో ప్రజలు మార్పు కోరుకోవడంతో మిత్రపక్షమైన డిఎంకె అధికారానికి దూరం కాగా సీని నటుడు విజయ్ పార్టీ గెలవడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజల్లో అసంతృప్తి కదిలించే శక్తి లెఫ్ట్ పార్టీలకే ఉంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుని ఉందన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి యూవతను బొద్దింకలతో పోల్చడం, దానికి ’కాక్రోచ్ జనతా పార్టీ’ అని పేరు పెట్టి సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి లభించిన అపూర్వ మద్దతే ప్రజలకు ప్రభుత్వాలపై ఉన్న అసంత్పపికి నిదర్శనమన్నారు. నివ్వురు గప్పిన నిప్పులా ఉన్న ఆ సంతృప్తి బడమాగ్నిగా మారడానికి ప్రజలు మంచి వేదిక కోసం చూస్తున్నారనిఆవేదిక సిపిఐ కావాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు.అయితే బిఆర్ఎస్ కేవలం పత్రిక ప్రకటనలకు మాత్రమే పరిమితమైందన్నారు. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలపై పోరాడే అసలైన శక్తి కేవలం సిపిఐకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. రైతులు, ధాన్యం సమస్యలు, ఆర్‌టిసి, కనీస వేతనాలు, సింగరేణి, పోడు భూములు, డబుల్ బెడ్ రూం ఇళ్ల కొరత వంటి అనేక అంశాలపై పార్టీ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు.
మొహమాటాలు వద్దు.. ఇకా ఉద్యమాలే
కాంగ్రెస్‌కు సిపిఐ మిత్రపక్షంగా ఉంది కాబట్టే ఉద్యమాలు చేయలేకపోతున్నామనే భావన ప్రజల్లో ఉందని, ఇక దీనిని తొలగించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. పొత్తు ధర్మం అనేది ఎన్నికలప్పుడు చూసుకుందామని కాని ఇప్పుడు ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
కనీస వేతనాల పెంపుదల పట్ల హర్షం
రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాల పెంపుదల చేసినట్లుగా ప్రకటించిన తరువాత పార్టీ ప్రతినిథి బృందం మరియు ఎఐటియుసి ప్రతినిథులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన వాటిలో కొన్నింటిలో మార్పులు చేసి జి.ఓ. 6ను ప్రకటించడం పట్ల సిపిఐ హర్షం ప్రకటిచింది. గతంలో ఉన్న 72 షెడ్యూల్ ఎంప్లాయ్‌మెంటులో కొన్నింటికి మాత్రమే కరువు భత్యం అమలు చేసే సౌలభ్యం ఉన్నప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం షెడ్యూల్ ఎంప్లాయ్‌మెంటులో అందరికి డిఎ వర్తింప జేdయడంతోపాటు, మరికొన్ని ఇతర రకాల ఎంప్లాయ్‌మెంట్‌లను ప్రస్తుతం జిఓలో పొందు పరచడం, అప్రంటీష్‌లాంటి కార్మికులకు కూడా జిఓలో ప్రకటించిన కనీస వేతనాల్లో 75% చెల్లించాలని ప్రకటించడం కార్మికులకు లాభదాయకం. ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల కన్నా ఒక వేళ ఎక్కువ వేతనం పొందుతున్న కార్మికులకు అదనంగా 10% వేతనం ప్రకటించడం ఎఐటియుసి కృషి ఫలితమే. కనీస వేతనాల పెంపుదలలో ఉన్న లోపాలను సరిదిద్దమని ఎఐటియుసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే పంచాయితీ కార్మికులకు ప్రతి నెల ఒకటవ తేదీన వేతనాలు చెల్లించాలని కోరడం జరిగింది. దీని వల్ల దాదాపు కోటి మందికి పైగా కార్మికులు ప్రయోజనం పొందుతారు.
55 స్థానాలు…భవిష్యత్తు లక్ష్యం
రాబోయే ఎన్నికల్లో పొత్తు ఉంటే కనీసం 5 అసెంబ్లీ స్థానాలకు తగ్గకుండా పోటీ చేయాల్సిందేనిని ఇందుకు అంటే ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.కేవలం ఒక్కటి,రెండు సీటుతో సరిపెట్టుకుంటే పార్టీ భవిష్యత్తుకే ప్రమాదంగా పరిణమిస్తున్న నేపథ్యంలో ఒకవేళ పొత్తు కుదరకపోతే 10 నుండి 15 స్థానాల్లో ఒంటరిగానైనా పోటీ చేసే శక్తిని సంపాదించుకోవాలని పిలుపునిచ్చారు.








