- ఇందిరమ్మ రాజ్యంలో అన్నివర్గాలకు మేలుజరుగుతుంది
- కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి పరుగులు పెడుతుంది
- సింగరేణి సర్పంచ్ మేదరి టోనీ
- సింగరేణి జీపీ లో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
కారేపల్లి, మహా:ఇందిరమ్మ రాజ్యంలో అన్నివర్గాలకు మేలుజరుగుతుందని సింగరేణి సర్పంచ్ మేదరి వీర ప్రతాప్(టోనీ) అన్నారు. సింగరేణి గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సర్పంచి టోనీ మాట్లాడుతూ.. సాధించుకున్న తెలంగాణ గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అబివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు,పేదలకు సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు, గృహ జ్యోతి పథకం తో పాటు అనేక పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ పథకాలన్నీ అద్భుత ఫలితాలను ఇస్తున్నాయనీ, ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో వైరా నియోజక వర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. ఎమ్మెల్యే సహకారంతో సింగరేణి గ్రామంలో ఒకే సారి రొండు కోట్ల రూపాయలతో సీ సీ రోడ్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. బొగ్గు గనుల పుట్టినిల్లయిన సింగరేణి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. రాజకీయాలకతీతంగా అన్నివర్గాల ప్రజలు గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు.








