Mahaa Daily Exclusive

  గిరిజన బిడ్డ ఎస్సై సురేందర్ కు దక్కిన అరుదైన గౌరవం…..

Share

  • గిరిజన బిడ్డ ఎస్సై సురేందర్ కు దక్కిన అరుదైన గౌరవం
  • పోలీస్ శౌర్య పతాకానికి ఎంపిక

 

కారేపల్లి, మహా:తెలంగాణ రాష్ట్ర అవతరణ

దినోత్సవం సందర్భంగా పోలీసు, అగ్నిమాపక శాఖలలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వం సోమవారం శౌర్య పతకాలను ప్రకటించింది.రాష్ట్రవ్యాప్తంగా 10 మందికి శౌర్య పతకాలు ప్రకటించగా సింగరేణి మండలం వెంకట్యతండా గ్రామపంచాయతీ పరిధిలోని భళ్లునగర్ తండాకు చెందిన ఎస్సై బానోతు సురేందర్ కూడా వీరిలో ఒకరుగా ఎంపికయ్యారు.సురేందర్ కొంతకాలంగా పోలీస్ గ్రేహౌండ్స్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు.తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2 సందర్భంగా ప్రకటించిన జాబితాలో ఉన్న పోలీస్ ఉద్యోగులకు ఆగస్టు 15 న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ శౌర్య పతకాలను ప్రత్యక్షంగా అందజేయనున్నారు.