ప్రపంచం ఇప్పుడు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం వైపు పరుగులు తీస్తోంది… సమాచార విస్పోటనంతో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అందరికి తెలిసి పోతోంది… ఇంతగా మేధో వికాసం ఇప్పుడు పరుగులు తీస్తున్నా చిన్న చిన్న విషయాలను మాత్రం మనుషులు పట్టించుకోవటం లేదు.. అదే ముప్పుగా మారుతోంది… వేసవి కాలం వస్తోంది అంటే అది అగ్ని ప్రమాదాలకు ఓ సంకేతమని, ఏ మాత్రం అలక్ష్యంగా వున్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అందరికి తెలుసు… అయినా ఈ విషయం అంత సీరియస్ గా ఎవ్వరు పట్టించుకోవటం లేదు… 24 గంటలు ల్యాబ్ ట్యాప్ లు, కంప్యూటర్ల వినియోగించుకునే రోజులు ఇవి… వాటిని కూల్ గా ఉంచేందుకు ఏ సీ తప్పని సరి… ఇక ఫ్యాన్ స్వీచ్ వేయటం తప్ప ఆఫ్ చేయటం అలవాటు లేని వారు ప్రతీ వంద మందిలో 90 మంది వున్నారని ఓ సర్వే చెప్పిన మాటలు వింటే ఆచ్చర్య పడక తప్పదు మరి… ఇంట్లో ఎవ్వరు లేక పోయినా వెలిగే లైట్లు, తీరిగే ఫాన్స్, మొగే టీ వీ ల సంఖ్య దేశంలో ఎనిమిది నించి 15 శాతం మేరకు చేరిందట… సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టి చార్జ్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయని వారి సంఖ్య దేశంలో 78 శాతం మేరకు ఉందంటే మన వారిలో నిర్లక్ష్యం ఎంతగా పేరుకు పోయిందో అర్ధం చేసుకో వచ్చు… సెల్ ఫోన్ చార్జింగ్ లో పెట్టి మాట్లాడటం ప్రమాదమని తెలిసి కూడా దాన్ని కొనసాగిస్తున్న వారి సంఖ్య దేశంలో 22 శాతం మేరకు వుందని ఓ సర్వే తేల్చి చెప్పింది… ఇలాంటి చిన్న తప్పిదాలు వెరసి భారీ అగ్ని ప్రమాదాలకు కారణం అవుతూనే వున్నాయి…








