- నేడు పండ్ల మార్కెట్ కు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి….
- పాల్గొననున్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే రంగారెడ్డి
- కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలి
- ఆదిభట్ల డివిజన్ అధ్యక్షులు పల్లె రజనీకాంత్ గౌడ్
ఇబ్రహీంపట్నం జూన్ 6 మహా:
రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా పండ్ల మార్కెట్ కు శంకుస్థాపన చేయనున్నట్లు, ఆదిభట్ల డివిజన్ అధ్యక్షులు పల్లె రజనీకాంత్ గౌడ్ తెలిపారు. ఈరోజు సాయంత్రం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, ఆదిభట్ల సర్కిల్, కోహెడ గ్రామంలో అంతర్జాతీయ స్థాయి హంగులతో దాదాపు 200 ఎకరాలలో పండ్ల మార్కెట్ శంకుస్థాపనకు, తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరుకానున్నారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొంటారు కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆదిభట్ల డివిజన్ అధ్యక్షులు పల్లె రజనీకాంత్ గౌడ్ పిలుపునిచ్చాను.
Post Views: 25








