- ప్రజాపాలనలో రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం భేష్..
- నేడు అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపన చేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
- కొంగరకలాన్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైళ్ళ శ్రీనివాసరెడ్డి
- కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలి…
ఇబ్రహీంపట్నం జూన్ 6 మహా:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా, కోహెడ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపన చేయనున్నట్లు పైల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నేడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని కోహెడలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి, అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపన చేసి, అనంతరం రైతు ప్రతినిధుల సభలో, రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ లతో కలిసి పాల్గొననున్నట్లు, కొంగరకలాన్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ యొక్క శంఖుస్థాపన కార్యక్రమానికి కొంగరకలాన్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చిన నాటి నుంచి నేటి వరకు అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉంటూ… ప్రజా సమస్యల పరిష్కరిస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజల పక్షాన నిలబడిన ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని పైల శ్రీనివాసరెడ్డి అన్నారు.








