Mahaa Daily Exclusive

  ఇంటింటి సర్వేలో ములుగు జిల్లా ఫస్ట్..

Share

  • సమగ్ర కుటుంబ సర్వేలో అందరూభాగస్వాములైనందుకు కృతజ్క్షతలు
  • రాష్ర్ట మంత్రి సీతక్క అభినందనలు

ములుగు జిల్లా ప్రతినిధి, మహా: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ములుగు జిల్లాలో 87.1శాతంతో మొదటిస్థానంలో నిలిచినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖా మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి,రాజకీయ కుల సర్వేలో భాగంగా తెలంగాణ రాష్ర్టంలోనే ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలవడం అధికారుల పనితీరుకు నిదర్శనమన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు, సర్వేలో భాగస్వాములుగా ఉన్న ప్రజలకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తలెఇపారు. దేశ చరిత్రలోనే అపూర్వమైన రీతిలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సమాజ సంక్లిష్టత, మౌళిక సమస్యలకు అద్దం పట్టేలా ఈ సర్వే జరుగుతుందని, సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఇచ్చిన వాస్తవిక అంచనాలు నూతన రాష్ట్ర ప్రభుత్వానికి దిశా నిర్దేశన చేయడమే కాకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజలు ప్రధానంగా భూమి, నీరు, నీడ, ఉపాధుల కోసం తపిస్తున్నారనే విషయం సర్వే నిగ్గు తేలుస్తుందని, ఆ లక్ష్యాల సాధనకు అన్ని వర్గాలను కలుపుకొని సమష్టిగా కృషి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు. సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

Latest