Mahaa Daily Exclusive

  23 నియోజకవర్గాలకు తెలంగాణ రక్షణ సేన ఇన్‌ఛార్జుల నియామకం….

Share

హైదరాబాద్, మహా.
తెలంగాణ రక్షణ సేన సంస్థాగత విస్తరణలో భాగంగా రాష్ట్రంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమించినట్లు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు.

23 మంది ఇన్‌ఛార్జుల నియామకాన్ని ప్రకటిస్తూ, తనకు అదృష్ట సంఖ్యగా భావించే ఐదు సంఖ్య వచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కవిత పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు.

మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్‌ఛార్జుల నియామకాలను కూడా దశలవారీగా ప్రకటిస్తామని కవిత తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేందుకు కార్యాచరణ కొనసాగిస్తున్నామని చెప్పారు. సంస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.

Latest