మణుగూరు, నవంబర్ 18, మహా
మణుగూరు మండలం, కూనవరం గ్రామపంచాయతీ పరిధిలోని రేగుల గండి చెరువు ప్రాంతంలో పర్యాటక ప్రదేశం గా తీర్చి దిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. చెరువులో సైకిలింగ్ బోట్లు, తెడ్డు సహాయంతో నడిచే బోట్లు ఏర్పాటు చేసి గుట్టల మధ్య నీటిలో ప్రయాణించేందుకు బోట్లు ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రం గా చేయాలనే ప్రణాళిక, అదేవిధంగా చినరావిగూడెం నుండి పర్ణశాల వరకు బోటు ప్రయాణం, పర్యాటక రంగ అభివృద్ధి గురించి కార్యాచరణ చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమం లో మణుగూరు తహసీల్దార్, రాఘవ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, మునిసిపల్ కమీషనర్ యాదగిరి, ఎంపీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు
Post Views: 34








