- నన్ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ చేతులు కలిపాయి
- కొడంగల్ బీఎల్ఏల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
- ఓటు లేకపోతే సంక్షేమ పథకాలు అందవని స్పష్టం
కొడంగల్, మహా : తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ, కేంద్రంలోని బీజేపీ తప్పిదాలను నిలదీస్తున్నందుకే ఆ రెండు పార్టీలు కలిసి తనపై కుట్రలు పన్నుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆ పార్టీలు సిద్ధాంతపరంగా వేరైనా, కాంగ్రెస్ను దెబ్బతీయడమే వారి ప్రధాన లక్ష్యమని.. తన ఓటమి కోసం కలిసి పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఓటరు జాబితా సమగ్ర సవరణపై కొడంగల్లో బుధవారం ఉదయం బిఎల్ఏలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నామని, కొడంగల్లో నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్కు మద్దతుగా ఉండే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఓట్లను జాబితా నుంచి తొలగించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ యత్నిస్తున్నాయని ఆరోపించారు. ఓటు లేని వ్యక్తి చనిపోయిన శవంతో సమానమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు విలువ గుర్తించి రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోవాలని సూచించారు.








