Mahaa Daily Exclusive

  ఫాం ఫాండ్స్ నిర్మాణానికి రైతులు ముందుకు రావాలి అడిషనల్ కలెక్టర్ శ్రీజ..

Share

 

కారేపల్లి, మహా : ఉపాధి హామీ ద్వారా ఉచితంగా నిర్మాణం చేస్తున్న ఫాం ఫాండ్(నీటి కుంటలు) ఏర్పాటు చేసుకోవటానికి రైతులు ముందుకు రావాలని అడిషనల్ కలెక్టర్ శ్రీజ కోరారు. బుధవారం సింగరేణి మండలం కారేపల్లిలోని షేక్ యాకూబ్ ఫాషా, సూరపురెడ్డి సీతారామిరెడ్డి, గాలి వెంకటరంగారావు భూములను అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. ఫాం ఫాండ్స్ నీరు భూమిలో ఇంకి భూగర్భ జలాలు పెరగటంతో పాటు సమీపంలోని వ్యవసాయ బోర్లలో నీటి మట్టం పెరుగుతుందన్నారు. భూమి 5 ఎకరాలు లోపు ఉండి ఇజీఎస్ కార్డు ఉన్న రైతులకు రూ.2లక్షలతో నీటి కుంటలు 12 x 15 కొలతలతో నిర్మాణం పూర్తిగా ఉచితంగా నిర్మించటం జరుగుతుందని తెలిపారు. వర్షాభావ పరిస్ధితిలలో రైతులు ఆరుతండి పంటలు మాత్రమే సాగు చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ వెంట ఎంపీడీవో పద్మ, తహసీల్ధార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్, ఏఈ నాగేంద్రబాబు, ఏవో బట్టు అశోక్ కుమార్, ఆర్ఐ జగదీష్, ఏఈవో మున్ని తదితరులు ఉన్నారు.