Mahaa Daily Exclusive

  వరంగల్ లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం..చెరువులు మాయం

Share

  • ఎఫ్ టీ ఎల్ లోనూ పుట్టగొడుగుల్లా వెంచర్లు, అక్రమ నిర్మాణాలు

వరంగల్, మహా;

వరంగల్ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో మధ్యల కుంట చెరువు మధ్యలోనే మాయమయ్యే పరిస్థితి నెలకొందని మత్స్యకారులు మండి పడుతున్నారు. వరంగల్ దేశాయిపేట, పైడిపల్లి ప్రధాన రహదారి పై దాదాపు తొమ్మిది ఎకరాల 17 గుంటల విస్తీర్ణంలో మధ్యల కుంట చెరువు కలదు. చెరువును కాపాడండి అంటూ వరంగల్ తాహసిల్దారు తోపాటు ఇరిగేషన్ అధికారుల చుట్టూ మూడు నెలల నుండి తిరిగిన స్పందించడం లేదని మత్స్యకారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై వరంగల్ జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిసింది. రాజకీయ అండ అధికారుల చొరవ తోనే చెరువు
రియల్ వెంచర్ల కు కనుమరుగైందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చేసేదేమీ లేక చిట్ట చివరిగా చెరువు రక్షణ కోసం త్వరలో సీఎం వద్దకు వెళ్ళనున్న మత్స్యకారుల సంఘం నాయకులు..