Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌లో భారీ వర్షాలు….

Share

హైదరాబాద్‌లో భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సీపీ వీసీ సజ్జనర్ సూచన

* భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సూచించారు.

* వాతావరణ శాఖ విడుదల చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వర్ష సూచనలకు అనుగుణంగా రోజువారీ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.

* గురువారం పంజాగుట్ట, ఖైరతాబాద్ జంక్షన్లలో ట్రాఫిక్ పరిస్థితులను సీపీ స్వయంగా పరిశీలించి, విధుల్లో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు.

* వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ, జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు.

* క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

* వర్షం కురుస్తున్న సమయంలో తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్లు, తెగిపోయిన విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

* లోతట్టు ప్రాంతాలు, ఫ్లైఓవర్ల వద్ద నీరు నిలిచే అవకాశం ఉన్నందున వాహనదారులు వేగం తగ్గించి అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు.

* మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, అత్యవసరమైతే తప్ప వర్షం సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.

* అత్యవసర పరిస్థితులు లేదా ట్రాఫిక్ సహాయం కోసం డయల్ 100ను సంప్రదించాలని సూచించారు.

* నగర ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా విడుదల చేసే ట్రాఫిక్ అడ్వైజరీలను తప్పనిసరిగా పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సీపీ విజ్ఞప్తి చేశారు.