*జిల్లా గ్రంధాలయం లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
*పూలమాల వేసి నివాళులర్పించిన చైర్మన్
వరంగల్, మహా;
తెలంగాణ సిద్ధాంత కర్త, ఉద్యమానికి ఊపిరి పోసిన , విద్యావేత్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 92వ జన్మదిన కార్యక్రమం వరంగల్ జిల్లా గ్రంధాలయ సంస్థ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్ జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి మలి దశ తెలంగాణ ఉద్యమానికి దిశా నిర్దేశం చేసిన మహనీయులు అని కొనియాడారు. ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకు వెళ్ళాలని యువతకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆయన తెలంగాణకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ వరంగల్ కార్యదర్శి పి.బుగ్గారెడ్డి, చిన్నబాబు, కాంగ్రెస్ నాయకులు మబ్బు ప్రవీణ్, కురిమళ్ల సంపత్, జన్ను శ్యామ్, గోపరాజు, కిరణ్, బూర సురేష్, అరుణ్, ప్రభు, అశోక్, చింటు, మనోజ్, సతీష్, సాందీప్ రాజు, పాఠకులు మొదలగు వారు పాల్గొన్నారు.








