- మహబూబాబాద్ జిల్లాలో ఫోర్జరీ కలకలం!
- ఉప సర్పంచ్ సంతకం ఫోర్జరీ చేసిన సర్పంచ్ భర్త
మహబూబాబాద్, మహా ;
మహబూబాబాద్ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల పెత్తనం మితిమీరిపోవడమే కాకుండా, ఏకంగా ఫోర్జరీ సంతకాలకు ఒడిగడుతుండటం స్థానికంగా కలకలం రేపుతోంది. మొన్న డోర్నకల్ పరిధిలోని గిరిపురం పంచాయతీ నిధుల దుర్వినియోగం, నిన్న గూడూరు మండలం గుండెంగ లో సర్పంచ్ కుమారుడి ఫోర్జరీ సంతకాల ఉదంతాలు మరువకముందే తాజాగా కొత్తగూడ మండలం రామన్నగూడెం గ్రామపంచాయతీలో మరో ఫోర్జరీ వ్యవహారం వెలుగుచూసింది.
రామన్నగూడెం పంచాయతీకి సంబంధించిన ఒక ముఖ్యమైన రికార్డుపై ఉప సర్పంచ్ కు తెలియకుండానే, ఆయన సంతకాన్ని సర్పంచ్ భర్త ఫోర్జరీ చేసి అధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది.
పరిశీలన సమయంలో అధికారులకు అనుమానం రావడంతో ఈ ఉదంతం బయటపడింది.
విషయం తెలుసుకున్న ఉప సర్పంచ్ అధికారులను నిలదీయడంతో సర్పంచ్ భర్త వెనక్కి తగ్గక తప్పలేదు.
అనంతరం కొత్తగూడ ఎంపీడీవో కార్యాలయంలో అధికారుల సమక్షంలోనే ఉప సర్పంచ్చేత మళ్లీ అసలైన సంతకాలు చేయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.







