కాకినాడ జిల్లా శృంగాధార గ్రామంలో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని గ్రామస్తులు గుర్తించారు.
దీంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. మృతుడు ఎవరు..? అక్కడికి ఎలా వచ్చారు..? మృతికి కారణం ఏమిటనేది ప్రస్తుతం తెలియాల్సి ఉంది.
గతంలో శృంగాధార గ్రామంలో పలు గొడవలు జరిగిన నేపథ్యంలో ఈ ఘటనపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఇది హత్యా..? ప్రమాదమా..? లేక ఇతర కారణమా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం తెలియాల్సి ఉంది.
Post Views: 121








