Mahaa Daily Exclusive

  తహసీల్దార్‌ అక్రమ ఆస్తులపై ఏసీబీ సోదాలు..! తహసీల్దార్‌ దాసరి శ్రీనివాస్‌రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు..

Share

  • రూ.7 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు
  • బహిరంగ మార్కెట్‌ విలువ రూ.100 కోట్లకు పైనే
  • తహసీల్దార్‌ దాసరి శ్రీనివాస్‌రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు

హైదరాబాద్, మహా : ఇబ్రహీంపట్నం ఆర్ డీ ఓ కార్యాలయంలో గతంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి అదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురంలోని ఆయన నివాసంతో పాటు ఆయన, కార్యాలయంతో సహా ఏకకాలంలో 7 ప్రాంతాల్లో మెరుపు సోదాలు జరిపారు. సోదాల్లో భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు
తుర్కయంజాల్‌లో – 3 ప్లాట్లు.
యాదగిరిగుట్టలో – 3 ప్లాట్లు.
హస్తినాపురంలో – 1 ప్లాట్‌.
విశ్వేశ్వర నగర్‌ కాలనీలో – 1 ప్లాట్‌. రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలంలో 10 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి.
హస్తినాపురంలో మూడంతస్తుల ఇల్లు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో మరో రెండు ఫ్లాట్లు. బంగారంపై పెట్టుబడులున్నట్లు గుర్తించారు. ఇంట్లో, బ్యాంకు లాకర్లలో కలిపి కిలోన్నరకు పైగా బంగారు ఆభరణాలు, శ్రీనివాస్‌రెడ్డి కుమారుడి పేరుతో గ్లాస్‌మేట్‌ బార్‌లో రూ.86 లక్షల పెట్టుబడి, సుమారు రూ.11 లక్షల విలువైన గృహోపకరణాలు గుర్తించారు. మొత్తం ఆస్తులు
రూ.7 కోట్లు అధికారిక లెక్కించగా మార్కెట్‌ విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ తేల్చింది.
మరిన్ని ఆస్తులు, నగదు, విలువైన వస్తువుల కోసం ఏసీబీ సోదాలు జరుపుతుంది.

Latest