- కేసు నమోదుచేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు
- డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు
హైదరాబాద్, మహా
నటుడు నాగార్జున ఇష్యూలో మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. పిటిషన్ తరుపు న్యాయవాది వాదనలకు న్యాయస్థానం ఏకీభవించింది. నాగార్జున వేసిన పిటిషన్ను కాగ్నిజెన్స్లోకి కోర్టు తీసుకుంది. మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిసి నెంబర్ 490/2024, 356బిఎన్ ఎస్ యాక్ట్ కింద కొండా సురేఖపై కేసు నమోదు చేసింది. సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 12వ తేదీన వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. తన ఫ్యామిలీని కించపరిచేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ నటులు అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మంత్రి వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున తీవ్రంగా ఖండించారు. క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు.








