గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అనంత ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఆగ్రహం వ్యక్తం చేసారు .
ముద్దలాపురం వద్ద 16ఎం.ఎల్.డి కెపాసిటీ వాటర్ ప్లాంట్ ట్రైల్ రన్ ను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి దగ్గుపాటి ప్రసాద్ గారు ప్రారంభించారు ,
గతంలో 61ఎం.ఎల్.డి కెపాసిటీ మాత్రమే ఉండేది 2017లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అదనంగా 16ఎం.ఎల్.డి ప్లాంట్ మంజూరు చేశారు
గత ఐదేళ్లలో ఒక్క అడుగు కూడా పనులు జరగలేదు ,కూటమి వచ్చిన ఐదు నెలల్లోనే ప్లాంట్ పూర్తి చేశాం ,దీని ద్వారా నగరంతో పాటు నారాయణపురం పంచాయతీ దాహార్తి తీరుస్తాం
మోటార్ల మరమ్మతులు చేసి.. తాగునీటి అంతరాయం లేకుండా చేస్తాం అర్బన్ ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు రానివ్వం.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు అన్నారు .
Post Views: 48








