వరంగల్, కార్పొరేషన్ మహా;
రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని బల్దియా మహిళా సిబ్బంది ప్రధాన కార్యాలయంలో శుక్రవారం కమిషనర్ టి.వెంకన్నకు రాఖీలు కట్టి, స్వీట్లు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మహిళా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
రాఖీ అనేది ప్రేమ, ఆత్మీయతకు ప్రతీక అని పేర్కొన్న కమిషనర్, బల్దియా కుటుంబ సభ్యులంతా పరస్పర గౌరవం, స్నేహభావంతో పరస్పర సహకారంతో విధులు నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో మహిళా సిబ్బంది ఉమ, ఇందిర, జ్యోతి, చందన, మమత తదితరులు పాల్గొన్నారు.







