- పొలిటికల్ లీడర్ల పాడుపనులు….
- అదుపు తప్పుతున్న అక్రమసంబంధాలు..
- జరిమానాలు.. పంచాయతీలతో వెలుగులోకి
- నేరాలకు దారితీసే ప్రమాదం పొంచివుందా..?
- కారేపల్లి మండలంలో హాట్ టాపిక్ గా మారిన కొందరు పొలిటికల్ లీడర్ల పాడుపనులు
కారేపల్లి,మహా:కారేపల్లి మండలంలో కొందరు పొలిటికల్ లీడర్లు చేస్తున్న పాడుపనులు రాజకీయ వ్యవస్థలకే ఇబ్బందికరంగా మారాయి. మండలంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే అక్రమ సంబంధాలు అదుపుతప్పి నేరాలకు దారితీసే ప్రమాదం పొంచి ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజా సేవకు అంకితమై సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన కొందరు మాజీ , తాజా ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకులు అక్రమసంభదాల్లో పట్టు బడి జరిమానాలు కూడా చెల్లించిన సందర్భాలు వ్యవస్థలో అత్యంతభాధాకరంగా ఉన్నాయి. ఓ మాజీ ప్రజాప్రతినిధి అక్రమసంబదంతో గ్రామస్థులకు పట్టుబడి 30 వేల రూపాయలు జరిమానా చెల్లించి బయటపడ్డ సంఘటన మండలవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మండలంలో ఈ వారంరోజుల్లోనే అక్రమ సంబంధాల వ్యవహారంలో పలు ఘర్షణలు.. పంచాయతీలు కూడా చోటుచేసుకోవడం కారేపల్లి మండలంలో హాట్ టాపిక్ గా మారింది.
*పంచాయతీలు… జరిమానాల పై పోలీసులు దృష్టి సారించాలి..
మండలంలో జరుగుతున్న పంచాయతీలు…పంచాయతీ పెద్దలు విధించే జరిమానాల పై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అక్రమ సంబంధాల వ్యవహారం లో నేరాలకు దారితీసే ప్రమాదం పొంచి ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీస్ యంత్రాంగం వీటి పై నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. కొందరు రాజకీయ పలుకుబడితో ఏదైనా చేయచ్చు అనే భావనతో చేస్తున్న పాడుపనులు సమాజాన్ని పాడుచేసే పరిస్థితిలోకి నెట్టే ప్రమాదం కూడా పొంచి ఉంది. తప్పుడు పనులు చేస్తే చట్టం తన పని తాను చేస్తుందనే భయం బొత్తి గా లేనట్లు వ్యవహరిస్తున్నారు కొందరు..మరికొందరు ఏకంగా చట్టం మన చుట్టమనే రీతిలో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. నిఘా వ్యవస్థలు పటిష్టంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా వ్యవహరిస్తే నేరాలు జరిగిన తర్వాత చర్యలు చేపట్టే దానికంటే నేర నియంత్రణకు దోహదపడతాయని సమాజహితం కోరే వారు అభిప్రాయపడుతున్నారు.







