Mahaa Daily Exclusive

  రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చంచల్ గూడ జైలులో ఘటన..!

Share

  • రిమాండ్ ఖైదీ ఆత్మహత్య
  • చంచల్ గూడ జైలులో ఘటన
  • రోడ్డు ప్రమాదం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కంది సాగర్

హైదరాబాద్, మహా : చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జైళ్ళ శాఖలో కలకలం రేపుతోంది. కంది సాగర్(31) అనే రిమాండ్ ఖైదీ జైలు వాష్‌రూమ్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే గుర్తించిన జైలు సిబ్బంది హుటాహుటిన సాగర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే మృతి చెందాడు. రోడ్డు ప్రమాదం కేసులో రిమాండ్‌లో ఉన్న సాగర్‌ను ఇటీవల నిజామాబాద్ జైలు నుంచి చంచల్‌గూడ జైలుకు బదిలీ చేశారు. ఈ ఘటనపై జైలు అధికారులు దర్యాప్తు చేపట్టారు. సాగర్‌ ఆత్మహత్యకు గల కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Latest