వరంగల్, కార్పొరేషన్ మహా ;
భద్రకాళి బండ్ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న ఆదేశించారు.
వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్‌పై కొనసాగుతున్న అభివృద్ధి పనులను గురువారం ఆయన బల్దియా ఇంజినీరింగ్, కుడా అధికారులతో కలిసి జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించి పరిశీలించారు.
ఈ సందర్భంగా బండ్‌పై కొనసాగుతున్న వివిధ ఇంజినీరింగ్ పనుల పురోగతిని, ఇప్పటికే పూర్తయిన పనుల పరిస్థితిని కమిషనర్ పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
బండ్‌పై నిర్మిస్తున్న టాయిలెట్ల పనులను పరిశీలించిన కమిషనర్, వాటిని నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని బండ్‌పై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
భద్రకాళి బండ్ పరిసరాల సుందరీకరణతో పాటు, భవిష్యత్‌లో నిర్వహణకు అవసరమైన చర్యలను కూడా ముందస్తు ప్రణాళికతో చేపట్టాలని సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం, సౌకర్యవంతమైన సేవలు అందేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యతలో రాజీ పడవద్దని కమిషనర్ స్పష్టం చేశారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కమిషనర్ వెంట ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఈఈ రవికుమార్, కుడా పీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు తదితరులు ఉన్నారు.







