*నిమ్స్ ఆసుపత్రి లో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని పరామర్శించిన టిపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు*
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట మాజీ డీసీసీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డిని టిపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఇతర ముఖ్య నాయకులు పరామర్శించారు.
ఉదయం ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కార్యకర్తల దాడిలో తూంకుంట నర్సారెడ్డి తీవ్రంగా గాయపడటంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ సందర్భంగా నర్సారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న పీసీసీ చీఫ్, మంత్రులు మరియు నాయకులు.. ఆయనకు అందుతున్న వైద్య చికిత్స వివరాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం నర్సారెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.








