విశాఖలో దుమారం రేపిన జాయ్ జెమీమా హనీట్రాప్ కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు.. పలు కీలక విషయాలను సేకరించారు. ఈ క్రమంలోనే ఫారెస్ట్ అధికారి వేణు భాస్కర్‌రెడ్డి వ్యవహారం బయటపడింది. జెమీమా, వేణు భాస్కర్‌రెడ్డి మధ్య భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు తేలింది.
జాయ్ జెమీమా.. పలువురు ధనవంతులు, అధికారులు, ఎన్నారైలకు అందమైన ఫోటోలను పంపి వారిని ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసింది. హనీట్రాప్ ద్వారా రూమ్‌కు పిలిపించుకోవడం.. వారికి మత్తు మందు ఇచ్చి నగ్న ఫొటోలు తీసి, వాటితో బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడింది. అయితే, జాయ్ జెమీమాకు పలువురు సహకరించినట్లు గుర్తించి వారిపై వేట కొనసాగిస్తున్నారు విశాఖ పోలీసులు. ఈ క్రమంలోనే ఫారెస్ట్ అధికారి వేణు భాస్కర్‌రెడ్డి బాగోతం బట్టబయలు అయింది. దీంతో పక్కా సచారంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Post Views: 12