- లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు…
- భక్తులతో కిక్కిరిసిన బీసీ కాలనీ…
కారేపల్లి, మహా:కారేపల్లి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద గురువారం మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారిని లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో ముస్తాబు చేసి భక్తులకు దర్శనమిచ్చారు.అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మహా అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులతోపాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.
మొదటిసారిగా కనకదుర్గ అమ్మవారి ప్రతిష్ఠాపన..
బీసీ కాలనీలో ఈ ఏడాది మొదటిసారిగా కనకదుర్గ అమ్మవారిని ప్రతిష్ఠించడంతో భక్తుల్లో ప్రత్యేక ఉత్సాహం నెలకొంది.”జైశ్రీరామ్ మహిళా కమిటీ సభ్యుల” పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి రోజువారి వివిధ అవతారాలను ప్రతిబింబించేలా బాలికలు చేసిన నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. పూజలు,భక్తి కార్యక్రమాలతో బీసీ కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.







