Mahaa Daily Exclusive

  ఉమ్మడి వరంగల్ జిల్లా జేఏసీ చైర్మన్‌గా ఎమ్మార్వో ఇక్బాల్..

Share

 

  • ఉమ్మడి వరంగల్ జిల్లా జేఏసీ చైర్మన్‌గా ఎమ్మార్వో ఇక్బాల్
  • ఉద్యోగులతో ముఖాముఖి సమావేశం విజయవంతం కావడంలో కీలక పాత్ర

వరంగల్,బ్యూరో మహా ;

ఉమ్మడి వరంగల్ జిల్లా జేఏసీ చైర్మన్‌గా తహసీల్దార్ ఇక్బాల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఉద్యోగులు, పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించిన ఉద్యోగుల ముఖాముఖి సమావేశానికి అధిక సంఖ్యలో ఉద్యోగులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయడంలో ఎమ్మార్వో ఇక్బాల్ కీలక పాత్ర పోషించారని పలువురు అధికారులు అభినందించారు.

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి హక్కుల సాధనకు జేఏసీ వేదికగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఇక్బాల్ నాయకత్వంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టి, ఉద్యోగుల ఐక్యతను బలోపేతం చేయాలని కోరారు. జేఏసీ చైర్మన్‌ గా నియమితులైన ఇక్బాల్ కు అధికారులు, శ్రేయోభిలాషులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.