బిగ్‌బాస్ ఫేమ్, ప్రముఖ నటి దివి (దివి వద్త్యా) ప్రస్తుతం గోవా వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. అక్కడ జరిగిన హాలోవీన్ వేడుకల్లో ప్రత్యేక లుక్‌లో పాల్గొని సందడి చేసిన ఆమె, ఆ పర్యటనకు సంబంధించిన అందమైన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. స్టైలిష్‌గా, గ్లామరస్‌గా ఉన్న ఆ ఫొటోలు క్షణాల్లోనే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫామ్‌లలో తెగ వైరల్ అవుతున్నాయి.











