- పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్పై కేసు నమోదు
- మున్సిపల్ ఎన్నికల రోజున ఆర్ వో ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించడంపై చర్యలు
- ఎంపీ అవినాష్ రెడ్డిపై కూడా కేసు
కడప, మహా : వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పులివెందుల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ రోజున పులివెందులలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు వైఎస్ జగన్ ధర్నా నిర్వహించడంపై పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఎన్నికల కోడ్, పోలింగ్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై పోలింగ్ రోజు రాత్రే పోలీసులు ఈ కేసును నమోదు చేసినట్లు తెలిపారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో వచ్చిన జగన్ ల్యాండింగ్ సమయంలోనూ వివాదం నెలకొంది. పర్మిషన్ ఇచ్చిన సమయానికంటే ముందుగా వచ్చారంటూ అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్ కు ముందుగా పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ఫ్యూయల్ కొరత సమస్య చూపడంతో వెంటనే ల్యాండింగ్ కు పర్మిషన్ ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్, ఎస్పీ తెలిపారు. ఎన్నికల సమయంలోనూ జగన్ ఇష్టారీతిన వ్యవహరించారని, ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు జరిగేలా వ్యవహరించడం సరికాదని అదేరోజు అధికారులు సూచించారు. చివరికి ఓటు వేయకుండానే జగన్ వెనుదిరుగుతున్నట్లు స్పష్టం చేస్తూ బెంగళూరుకు వెళ్లిపోయారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు గాను వైఎస్ జగన్తో పాటు వైఎస్ఆర్సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగించడం, ముందస్తు అనుమతి లేకుండా నిరసన చేపట్టడంపై అధికారులు విచారణ జరుపుతున్నారు.







