- ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిల్ల రాజేంద్ర ప్రసాద్
హనుమకొండ, మహా ;
హనుమకొండ జిల్లా కేంద్రం ‘డి’ కన్వెన్షన్ లో ఈ నెల నవంబర్ 14 న జరుగు ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ 6వ రాష్ట్ర సదస్సుకు రాష్ట్రంలోని న్యాయవాదులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ, సదస్సు కన్వీనర్ చిల్ల రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, మహబూబాబాద్ వరంగల్ జిల్లా నర్సంపేట కోర్టులలో న్యాయవాదులు, బార్ అసోసియేషన్ నాయకులు, ఐ ఎల్ పి ఎ నాయకులతో కలిసి గోడ పత్రికలను, కరపత్రాలను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. అంబేద్కర్ పిలుపునిచ్చిన ‘పే బ్యాక్ టు సొసైటీ’ లక్ష్యంగా నల్ల కోట్లతో నీలి విప్లవం నినాదంతో ఐ ఎల్ పి ఎ పనిచేస్తుందని మహాత్మ జ్యోతిరావు పూలే, అంబేద్కర్ సిద్ధాంత పునాదితో నిరంతరం బహుజన అణగారిన పేద న్యాయవాదుల వృత్తి నైపుణ్యం కోసం కృషి చేస్తూనే బహుజన సమాజ చైతన్యం కోసం పని చేస్తున్నామని అన్నారు. సాంస్కృతిక విప్లవం విజయవంతం కాకుండా బహుజన సమాజ విముక్తి జరగదని, భారత రాజ్యాంగం న్యాయవాదులకు ఉపయోగపడే గ్రంథమే కాదని బడుగు బలహీన వర్గాల జీవితాలను మార్చే స్ఫూర్తిదాయక వాహనమని అలాంటి రాజ్యాంగ స్ఫూర్తిని గ్రామగ్రామానికి తీసుకెళ్లడమే ఐ ఎల్ పి ఎ లక్ష్యమని ఆయన అన్నారు.
బి.సి మోర్చా జాతీయ అధ్యక్షులు చౌదరి వికాస్ పటేల్ అధ్యక్షతన జరుగు సదస్సుకు ముఖ్య అతిథిగా విశ్రాంత హై కోర్టు జడ్జి, తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ కమీషన్ కమీషనర్ జస్టిస్ ఈద తిరుమలదేవి హాజరవుతున్నారని, గౌరవ అతిధులుగా వరంగల్, హనుమకొండ జిల్లా జడ్జిలు వి.బి. నిర్మలా గీతాంబ, ఎం.ఆర్. సునీత లు, పంచాయతీ రాజ్ మంత్రి దనసరి అనసూయ సీతక్క, వరంగల్ పచ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హాజరవుతున్నారని తెలిపారు.
79 ఏండ్ల స్వాతంత్ర భారతంలో మహిళా స్వేచ్ఛ అనే అంశంపై ప్రొఫెసర్ ఇ. సుధారాణి, ఎస్ ఐ ఆర్ పేరుతో ఓట్ల తొలగింపు అనే అంశంపై ప్రొఫెసర్ గుగులోతు వీరన్న నాయక్, సామాజిక న్యాయం – బహుజనుల ఐక్యత అనే అంశంపై తెలుగు అకాడమీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రజాస్వామ్యంలో జడ్జీల నియామకం – లోపాలు అనే అంశంపై ఐ ఎల్ పి ఎ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పొన్నం దేవరాజు గౌడ్ ఉపన్యాసాలు ఇస్తారని తెలిపారు. వీరితో పాటు ఐ ఎల్ పి ఎ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎన్ జె శాంసన్, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, మెటుపల్లి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దయ రాజారాం, బహుజన ముక్తి పార్టీ జాతీయ అధ్యక్షులు దాసురాం నాయక్, రాష్ట్రీయ ముక్తి మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి ముఫ్తీ మహమ్మద్ ఫహీమొద్దీన్, ప్రొఫెసర్ డాక్టర్ కూరపాటి రమేష్, ప్రొఫెసర్ వెంకయ్య, ప్రొఫెసర్ ఈసం నారాయణ, ప్రొఫెసర్ నిమ్మ సుదర్శన్, ఆదర్శ విద్యా సంస్థ చైర్మన్ బూర విద్యాసాగర్, బ్యాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షులు డి నరేందర్,
బ్యాంసెఫ్ నాయకులు ఎ సంతోష్ కుమార్, ఐ ఎల్ పి ఎ నాయకులు తిప్పన డాంగే, తీగల జీవన్ గౌడ్, వి.ఎం. కృష్ణారెడ్డి, గజ్జల వెంకట్ రెడ్డి, అనంత ఆంజనేయులు, భానుప్రియ, చిల్ల రమేష్, టి. డేవిడ్, మహమ్మద్ ముధసిర్ అహ్మద్, వెంకటయ్య ముదిరాజ్ తదితర మేధావులు హాజరవుతారని తెలిపారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ఐ ఎల్ పి ఎ రాష్ట్ర కమిటి సభ్యులు ఎగ్గడి సుందర్ రామ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు విలాసాగరం సురేందర్ గౌడ్, తొర్రూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. వెంకటరత్నం, ఉపాధ్యక్షులు నాగేశ్వర్, ప్రధాన కార్యదర్శి టి. సైదులు, మహబూబాబాద్ బార్ అధ్యక్షులు మామిడాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జంగం సిద్ధార్థ, ఐ ఎల్ పి ఎ తొర్రూరు బార్ అధ్యక్షులు వలపు మధుసూదన్, కలవకొలను ప్రవీణ్ రాజు, తొర్రూరు న్యాయవాదులు పల్లవి, నాగరాజు, చంద్రయ్య, మహేష్, ఐలోని, శ్రీధర్, యాకేందర్, రమేష్, మహబూబాబాద్ న్యాయవాదులు ఆరేళ్లి శ్రీనివాస్, దర్శనం రామకృష్ణ, బాలాజి, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్, వాసం ఆనంద్, రాజమణి, మందుల శ్రీనివాస్, హరిబాబు, నర్సంపేట న్యాయవాదులు అంబటి శ్రీనివాస్, షేక్ రహీమోద్దీన్, దొంతి సాంబయ్య, మోటూరి రవి, రోజ, పండగ శ్రీనివాస్, శివ తదితరులు హాజరయ్యారు.








